ఎట్టకేలకు గెలిచారు

25 Jan, 2014 01:00 IST|Sakshi
ఎట్టకేలకు గెలిచారు

 పెర్త్: గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు యాషెస్ టెస్టులు, నాలుగు వన్డేలు ఆడింది. యాషెస్‌ను 0-5తో కోల్పోగా, ఐదు వన్డేల సిరీస్‌లోనూ వరుసగా మూడు వన్డేల్లో ఓడింది. 8 ఓటముల అనంతరం ఎట్టకేలకు కుక్ సేన విజయం రుచి చూసింది.
 
  బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 70; 6 ఫోర్లు; 1 సిక్స్), (4/38) ఆల్‌రౌండ్ షోతో... శుక్రవారం వాకా మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. బెల్ (52 బంతుల్లో 55; 9 ఫోర్లు), బట్లర్ (43 బంతుల్లో 71; 6 ఫోర్లు; 4 సిక్స్‌లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు 4 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆరోన్ ఫించ్ (111 బంతుల్లో 108; 8 ఫోర్లు; 4 సిక్స్) సెంచరీ చేయగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.
 

>
మరిన్ని వార్తలు