ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

17 Jun, 2019 16:04 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటైన ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.  ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.  శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో జేసన్‌ రాయ్‌ అర్థాంతరంగా మైదానాన్ని వీడాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే ఫీల్డ్‌లో ఉన్న రాయ్‌ను గాయం వేధించడంతో గ్యాలరీకి పరిమితమయ్యాడు. ఆపై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అఫ్గానిస్తాన్‌, శ్రీలంక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.

జూన్‌ 25వ తేదీన ఆస్ట్రేలియాతో జరుగనున్న మ్యాచ్‌కు రాయ్‌ జట్టుతో కలుస్తాడని ఇంగ్లండ్‌ యాజమాన్యం స్పష్టం చేసింది.  మరొకవైపు విండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కూడా వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు. రేపు అప్గానిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సైతం మోర్గాన్‌ అందుబాటులో ఉండటం అనేది అనుమానమే. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకూ ఇంగ్లండ్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించింది.


 

మరిన్ని వార్తలు