మోర్గాన్‌.. తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా

30 May, 2019 19:02 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్‌ 2019లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక వన్డేలు(200)లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ సారథి పాల్‌ కాలింగ్‌వుడ్‌(197) రికార్డును అదిగమించాడు. అతర్వాతి స్థానంలో జేమ్స్‌ అండర్సన్‌(194), స్టివార్ట్‌(170), ఇయాన్‌ బెల్‌(161)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా మోర్గాన్‌ అందుకున్నాడు.  

ఓవరాల్‌గా 223వ అంతర్జాతీయ వన్డేలు ఆడిన మోర్గాన్‌.. అందులో 23 వన్డేలు ఐర్లాండ్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. 2006లో ఐర్లాండ్‌ తరుపున​ స్కాట్లాండ్‌పై అరంగేట్రం చేసిన మోర్గాన్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అనంతరం 2009లో ఇంగ్లండ్‌ జట్టుకు మారాడు. 2009లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ తరుపున మరోసారి అరంగేట్రం చేశాడు. ఇక ఆటగాడిగానే కాకుండా సారథిగా కూడా మోర్గాన్‌ రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ మోర్గాన్‌కు సారథిగా 101వది కావడం విశేషం. ఇప్పటివరకు మోర్గాన్‌ సారథ్యంలో 100 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు