మోర్గాన్‌ ‘టీ20 బ్లాస్ట్‌’

31 Aug, 2019 12:01 IST|Sakshi

టాంటాన్‌"  ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మరోసారి విజృంభించాడు. టీ20 బ్లాస్ట్‌ సిరీస్‌లో భాగంగా మిడిల్‌సెక్స్‌ తరఫున ఆడుతున్న మోర్గాన్‌.. శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి పోయాడు. 29 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 83 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ టామ్‌ బెల్‌(101 నాటౌట్‌; 47 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో భారీ  స్కోరు చేసింది.

అటు తర్వాత 227 పరుగుల లక్ష్య ఛేదనతో బ‍్యాటింగ్‌కు దిగిన మిడిల్‌సెక్స్‌కు డేవిడ్‌ మాలన్‌(41; 14 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పాల్‌ స్టిర్లింగ్‌(25; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు సాధించింది.ఆపై డివిలియర్స్‌(32; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.  కాగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్‌ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. సోమర్‌సెట్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మోర్గాన్‌ ధాటికి మిడిల్‌సెక్స్‌ 17 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇది ఈ టోర్నమెంట్‌ చరిత్రలోనే ఛేజింగ్‌ రికార్డుగా నమోదైంది. 2014లో ససెక్స్‌ 226 పరుగుల టార్గెట్‌ను ఎసెక్స్‌పై సాధించగా, అది ఇప్పటివరకూ అత్యుతమ ఛేజింగ్‌ రికార్డుగా ఉంది. దాన్ని ఐదేళ్ల తర్వాత మిడిల్‌సెక్స్‌ బ్రేక్‌ చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా