ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరే జట్లు అవే: డూప్లెసిస్‌

7 Jul, 2019 14:19 IST|Sakshi
ఫాఫ్‌ డూప్లెసిస్‌

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడతాయని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌ జోస్యం చెప్పాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్‌ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై గెలుపు తమకన్నా ఎక్కువగా భారత్‌ సంతోషిస్తుందన్నాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్లే ఫైనల్లో తలపడుతాయని, కీలక మ్యాచ్‌లను ఆసీస్‌, భారత్‌లు అద్భుతంగా ఆడుతాయన్నాడు.

కీలక పరిస్థితుల్లో తాను ఎదో ఒక జట్టుకు మద్దతుగా నిలవక తప్పదన్నాడు. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్‌ ఓటమితో భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ ఖరారు కాగా.. ఆసీస్‌.. ఇంగ్లండ్‌తో ఆడనుంది. 

గూగుల్‌ సీఈవో నోట అదే మాట..
క్రికెట్‌ డైహార్డ్‌ ఫ్యాన్‌, గూగుల్‌ సీఈవో సుంధర్‌ పిచాయ్‌ సైతం ఫైనల్లో తలపడేవి భారత్‌- ఇంగ్లండేనని తెలిపారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు కూడా బలమైన జట్లేనని, కానీ వీటితో జరిగే పోరులో ఇంగ్లండ్‌, భారత్‌లే పైచేయి సాధిస్తాయని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు