-

పాకిస్తాన్ ఓటమిపై కోచ్ ఆవేదన

5 Jun, 2017 16:53 IST|Sakshi
పాకిస్తాన్ ఓటమిపై కోచ్ ఆవేదన

బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమి చెందడం పట్ల ఆ జట్టు కోచ్ మికీ ఆర్ధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటే పాకిస్తాన్ ఆటగాళ్ల మాత్రం ప్రతీదాంట్లోనూ వైఫల్యం చెందారన్నాడు. కనీస బేసిక్స్ ను అమలు చేయడంలో విఫలం కావడంతోనే భారత్ కు పోటీ ఇవ్వకుండా లొంగిపోయామన్నాడు.

 

'మా ఆరంభం బాలేదు. ప్రధానంగా బేసిక్స్ ను కూడా ఫాలో కాలేకపోయాం. పదే పదే క్యాచ్లు వదిలేయడం మా జట్టు కొంపముంచింది. వికెట్లను డైరెక్ట్ గా కొట్టడలేకపోవడమే కాదు.. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కూడా విఫలమయ్యాం. మరొకవైపు ఫీల్డింగ్ లో వైఫల్యం చెందాం. ఓవరాల్ గా మేము ఏదైతే చేయాలని ఫీల్డ్ లో దిగామో అది చేయలేకపోయాం. వన్డే క్రికెట్ లో మేము ఎక్కడ ఉన్నమనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది'అని ఆర్ధర్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు