భారత్- సఫారీ టీ20 ఫేక్ అప్డేట్స్

2 Oct, 2015 23:19 IST|Sakshi
భారత్- సఫారీ టీ20 ఫేక్ అప్డేట్స్

ధర్మశాల: గాంధీ- మడేలా సిరీస్ లో భాగంగా ఆతిథ్య భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం ధర్మశాలలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా సోషల్ నెట్వర్క్ లో ఫేక్ అప్ డేట్స్ హల్ చల్ చేశాయి. మ్యాచ్ జరిగిన తీరును విశ్లేషిస్తూ పలువురులు నెటిజన్లు పోస్ట్ చేసిన సెటైర్లలో కొన్ని నవ్వుతెప్పించగా, మరికొన్ని కాస్త ఇబ్బందికరంగా అనిపించాయి. అలా చక్కర్లు కొడుతున్న కామెంట్లలో కొన్ని..

పటేల్ డిమాండ్: ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు పరుగులు సాధించే విషయంతోపాటు వికెట్లు నేల కూల్చడంలోనూ మినహాయింపు కల్పించాలని పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ డిమాండ్. (ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ అందరికంటే ఎక్కువగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఏకంగా 22 పరుగులిచ్చి సఫారీల విజయానికి అడ్డంకులు తొలిగించాడు. అటు బ్యాటింగ్ లోనూ ఐదో డౌన్ లో వచ్చి రెండు పరుగులు మాత్రమే చేశాడు.)

ఏ 'బీ' అలర్ట్: భారత బౌలర్లపై ఏబీ డివిలియర్స్ విరుచుకుపడుతున్నాడు. అతని ఐపీఎల్ కాంట్రాక్టు విషయాన్ని బీసీసీఐ ఓసారి గుర్తుచేస్తే మంచిది.

ఇట్ ఈస్ ద టైమ్: విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అనుష్క శర్మఅండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవాల్సిన సమయమిదే.

ఇది కదా టాలెంట్: రోహిత్ శర్మ టాలెంట్.. ప్రత్యర్థి బౌలర్లు వైడ్లు, నోబాల్స్ వేసేలా చేసింది.

చిన్న చేప- తిమింగలం: ఐసీసీ..సౌతాఫ్రికా జట్టును చిన్న చేపగా పరిగణించి పెద్ద సెరీస్ ల నుంచి బహిష్కరించాలి. రోహిత్ తిమింగలంలా విజృంభిస్తుంటే సఫారీల పరిస్థితి అలాగే అనిపించింది.

సహారా నహీ: అబ్ సౌతాఫ్రికాకో రబడా సహారా బీ నహీ హై(ఇప్పుడు సౌతాఫ్రికాకు రబడా సహకారాం కూడా లేదు)

ఉమేశ్ యాదవ్ సెంచరీ: ఈ రోజు ఉమేశ్ యాదవ్ కూడా సెంచరీ చేశాడు.. రంజీ ట్రోఫ్రీ మ్యాచ్ లో. ఇటు రోహిత్ శర్మ కూడా శతకం సాధించాడు. ఎంత మంచి పరినామమో!

నైతిక విజయం మనదే: ధర్మశాల ఎలాగూ విభిన్న వేదికే కాబట్టి.. ఓడిపోయినా నైతిక విజయం టీమిండియాదే. (ధర్మశాల ప్రాంతం సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్- సీటీఏ ఆధ్వర్యంలో ఉంది)

మరిన్ని వార్తలు