అజేయంగా 370 పరుగులు చేశాడు!

23 Jul, 2018 09:42 IST|Sakshi

బులవాయో: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఫఖర్‌ ‘జమానా’ మొదలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫార్మెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో వేగవంతంగా 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఫఖర్‌ పరుగుల పండుగ చేసుకున్నాడు. అత్యద్భుతంగా రాణించి బ్యాటింగ్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 257.5 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌ సెంచరీ(210), సెంచరీ(117), రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఐదు వన్డేల్లో మూడుసార్లు అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం. అంటే అజేయంగా 370 పరుగులు సాధించాడన్న మాట.

28 ఏళ్ల ఫఖర్‌ జమాన్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడి 76.07 సగటుతో మొత్తం 1065 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 210 పరుగులు నాటౌట్‌.

ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు..
1. ఫఖర్‌ జమాన్‌(515)- పాకిస్తాన్‌
2. హెచ్‌. మసకజ్జా(467) - జింబాబ్వే
3. సల్మాన్‌భట్‌(451)- పాకిస్తాన్‌
4. మహ్మద్‌ హఫీజ్‌(448)- పాకిస్తాన్‌
5. రోహిత్‌ శర్మ(441)- భారత్‌

మరిన్ని వార్తలు