రోహిత్‌.. ఐపీఎల్‌ ఆడటం ఆపేయ్‌!

29 Oct, 2019 12:38 IST|Sakshi

ముంబై: దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటే దీన్ని పురస్కరించుకుని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చేసిన ఒక పోస్ట్‌ విమర్శల పాలైంది. ‘ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకు రావాలని కోరుతున్నా. ఈ దీపావళికి దీపాలు వెలిగించుదాం. టపాసులు కాల్చే ముందు ఈ అమాయక ప్రాణులను దృష్టిలో పెట్టుకుందాం. అవి భయపడుతుంటే చూడటం బాధగా ఉంది’’ అంటూ రోహిత్ ఓ కుక్క వణికిపోతున్న వీడియోను షేర్‌ చేశాడు. దీపావళికి వెలుగులు తీసుకొచ్చే టపాసులు కాల్చవద్దనే అర్థంలో రోహిత్‌ చేసిన ట్వీట్‌ కాస్త విమర్శలకు దారి తీసింది. దీనిపై నెటిజన్లు రోహిత్‌పై విరుచుకుపడుతున్నారు.

‘కుక్కకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారా?? మరి న్యూ ఇయర్ అప్పుడు కుక్క ఇయర్ బడ్స్ పెట్టుకుంటుందా??’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘భారత్‌ మ్యాచ్ గెలిస్తే.. దీపావళి కంటే ఎక్కువ టపాసులు కాలుస్తారు? కానీ, మీకు దీపావళి అప్పుడే జ్ఞానం వస్తుందా?’  అని మరొకరు ట్వీట్‌ చేశారు.  ‘ఐదు నెలల క్రితం నువ్వు ఇదే టపాసులు ఎంజాయ్ చేశావు?? గుర్తు తెచ్చుకో’ ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ మరొక అభిమాని సెటైర్‌ వేశాడు. ‘నువ్వు ఐపీఎల్ ఆడటం ఆపేయ్‌. అందులోనే టపాసులు ఎక్కువ కాలుస్తారు కదా’ అని మరొక అభిమాని చమత్కరించాడు. ‘ఐపీఎల్ ఆడటం ఎప్పుడు మానేస్తున్నావు మరి’ అని ఒక అభిమాని ఎద్దేవా చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధోని బ్యాక్‌ హ్యాండ్‌ స్మాష్‌కు బ్రేవో షాక్‌!

ద్రవిడ్‌తో గంగూలీ భేటీ!

నువ్వు చేసిన తప్పు ఏమిటో జడేజాను అడుగు..!

‘టీమిండియాను కాపీ కొట్టండి’

బ్యాడ్మింటన్‌లో మెరిసిన మరో తెలంగాణ అమ్మాయి

సైనా ముందడుగు వేసేనా!

వార్నర్‌ మెరుపు సెంచరీ 

షకీబ్‌ భారత్‌కు వస్తాడా! 

ఫెడరర్‌@103 

టైగర్‌ వుడ్స్‌ రికార్డు విజయం

న్యూ గినియా వచ్చేసింది

నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ

రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జంట 

నేనీ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు ఆయనే కారణం!

రిషభ్‌ మా భవిష్యత్తు...మరి సాహా!

షకిబుల్‌కు భారీ ఊరట

‘దశ ధీరుడు’ ఫెడరర్‌

‘ఈ దశాబ్దంలో అతడే బెస్ట్‌ ఫీల్డర్‌’

టీమిండియా ప్రపోజల్‌.. బంగ్లా ఓకే చెప్పేనా?

ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్‌ మిస్‌

19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..

హ్యాట్రిక్‌ వరల్డ్‌ టైటిల్‌కు స్వల్ప దూరంలో..

విరుష్క దీపావళీ సెలబ్రేషన్‌ పిక్చర్స్‌

టీ20 చరిత్రలో చెత్త రికార్డు

బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానుల ఫైర్‌

చెస్‌ చాంపియన్‌ శ్రీశ్వాన్‌

ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పీవీ సింధు

నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ బోణీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది