అయినా ట్వీట్‌ చేస్తే.. ఆయనకు సిగ్గు లేనట్టే..!!

11 Dec, 2019 15:38 IST|Sakshi

మంజ్రేకర్‌పై టీమిండియా అభిమానుల ఫైర్‌

ముంబై : ఇటీవలి కాలంలో తరచూ నెటిజన్ల కోపానికి గురౌవుతున్న కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి ట్రోలింగ్‌కు బలయ్యాడు. వెస్టిండీస్‌ జరుగుతున్న మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఘర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టీ20ల్లో మరింత మెరుగవ్వాలంటే విండీస్‌తో మరిన్ని టీ20 సిరీస్‌లు ఆడాలని మంజ్రేకర్‌ ట్విటర్‌ వేదికగా సూచించాడు. ఇదే టీమిండియా అభిమానుల కోపానికి కారణమైంది.
(చదవండి : మంజ్రేకర్‌.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!)

చిన్న జట్టు అఫ్గానిస్తాన్‌తో చేతిలో టీ20 సిరీస్‌లో కోల్పోయిన విండీస్‌ గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో తేడావస్తే టీమిండియా ఆటతీరును తక్కువ చేసి మాట్లాడతావా అని మండిపడుతున్నారు. ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై మంజ్రేకర్‌ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ.. ‘నువ్‌ హర్షాతో మరిన్ని కామెంటరీలు చేస్తే బాగుంటుంది. అప్పుడు గానీ...’అని ఓ అభినెటిజన్‌ రిప్లై ఇచ్చాడు. ‘పనికిరాని సలహాలు ఇస్తున్న మంజ్రేకర్‌... ఆయన ట్వీట్లకు వచ్చిన రిప్లైలు చదివి కూడా మళ్లీ ట్వీట్‌ చేయాలని చూస్తే.. ఆయనకు సిగ్గు లేనట్టే..!’అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. ఇక సిరీస్‌ నిర్ణాయక మూడో టీ20 వాంఖడే స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరుగనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా