‘టాప్’లో సానియా

17 Nov, 2015 03:40 IST|Sakshi

ఆర్థిక సాయం కోరిన టెన్నిస్ స్టార్
న్యూఢిల్లీ: ‘నేను రియో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నాను. మెరుగైన శిక్షణతో పాటు ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సహకారం అందించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’... ఇదీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన అభ్యర్థన. ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టియాన్ ఫిల్హాల్ వద్ద తాను కోచింగ్ తీసుకుంటున్నానని, అందు కోసం వారానికి 3 వేల డాలర్ల చొప్పున...

ఇతర శిక్షణ ఖర్చులకు వారానికి మరో 2 వేల డాలర్ల చొప్పున తనకు ఇవ్వాలని కూడా సానియా తన లేఖలో విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... తమ పథకం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో తాజాగా సానియా పేరు చేర్చింది. దీని ప్రకారం ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు మీర్జాకు మొత్తం రూ. 60 లక్షలు లభిస్తాయి. తన కోచింగ్ షెడ్యూల్ పూర్తి వివరాలు అందించిన వెంటనే ముందుగా రూ. 30 లక్షలు విడుదల చేస్తారు. తన డబుల్స్/మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వామిని ఎంచుకున్న తర్వాత మరో రూ. 30 లక్షలు ఇస్తారు.

>
మరిన్ని వార్తలు