తొలి సెషన్లోనే భారత్ ఆలౌట్

27 Mar, 2017 12:13 IST|Sakshi
తొలి సెషన్లోనే భారత్ ఆలౌట్

ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 332 పరుగుల వద్ద ఆలౌటైంది. 248/6 ఓవర్ నైట్  స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆదిలో నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా (63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వృద్ధిమాన్ సాహా(31;102 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి 96 విలువైన భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును భారత్ అధిగమించింది. కాగా ఏడో వికెట్ గా జడేజా పెవిలియన్ చేరిన తరువాత స్వల్ప విరామాల్లో మిగతా వికెట్లను కోల్పోయిన భారత్ లంచ్ లోపే   ఇన్నింగ్స్ ను ముగించింది.

ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఆచితూచి ఆడింది. ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న జడేజా-సాహాలు జోడి స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు.అయితే ఆ తరువాత ఎంతోసేపో జడేజా క్రీజ్లో నిలవలేదు. ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతని లోపలికి ఆడిన జడేజా బౌల్డ్ అయ్యాడు. ఆపై  భువనేశ్వర్ కుమార్, సాహా, కల్దీప్ యాదవ్లు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ 32 పరుగుల ఆధిక్యంలో్ ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు