‘ఫిఫా’ ఆర్జన  రూ. 44 వేల కోట్లు 

7 Mar, 2019 00:19 IST|Sakshi

లండన్‌: ఈ జగతిని, జనాన్ని ఊపేసే క్రీడ ఫుట్‌బాల్‌. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ఫుట్‌బాల్‌ ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ‘ఫిఫా’ రాబడి ఈసారి మరింత పెరిగింది. ఈ క్రీడాపాలక సంస్థ ఆర్జన 6.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.44 వేల కోట్లకు పైమాటే! నగదు నిల్వలు కూడా 2.74 బిలియన్‌ డాలర్ల (రూ.19 వేల కోట్లు)కు పెరిగాయి.

గతేడాదే ఫట్‌బాల్‌  ప్రపంచకప్‌ జరిగింది. ‘ఫిఫా’ ఆదాయవ్యయాలను  ప్రపంచకప్‌ నాలుగేళ్ల సైకిల్‌ను బట్టి గణిస్తారు. బ్రెజిల్‌ ప్రపంచకప్‌ (2014) సైకిల్‌ ప్రకారం అప్పటి నగదు నిల్వలు 1.523 బిలియన్‌ డాలర్లు (రూ. 10 వేల కోట్లు). అయితే మొత్తం ఆదాయం 5.718 బిలియన్‌ డాలర్లు (రూ.40 వేల కోట్లు). ఈ నాలుగేళ్లలో ‘ఫిఫా’ ఆదాయం 4 వేల కోట్లు పెరిగింది.   

మరిన్ని వార్తలు