మళ్లీ ఫిఫా అధ్యక్ష ఎన్నికలు!

20 Jul, 2015 08:39 IST|Sakshi
మళ్లీ ఫిఫా అధ్యక్ష ఎన్నికలు!

జ్యూరిచ్: భారీ అవినీతి ఉదంతంతో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా ) లో మరోసారి అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సోమవారం సాకర్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ప్రధాన కార్యాలయంలో  ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల తేదీపై ఫిఫా వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ వెబ్ తో అధ్యక్షుడు సెప్ బ్లాటర్ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అధ్యక్ష ఎన్నికల రేసులో యూఈఎఫ్ఏ అధ్యక్షుడు ,ఫ్రెంచ్ దేశానికి చెందిన మైకేల్ ప్లాటిని(60) ముందు వరుసలో ఉన్నారు. కాగా, భారత సంతతికి చెందిన అమెరికన్ సునీల్ గులాటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.  మాజీ బాస్ సెప్ బ్లాటర్ వారసుడిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది.

గత మే 29వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా బ్లాటర్ ఎన్నిక కావడం.. ఆపై రెండు రోజులకే బ్లాటర్ రాజీనామా చేయడం తెలిసిందే.  ఫిఫాలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలతో ఆరుగురు ఫిఫా అధికారులు అరెస్ట్ కావడంతో బ్లాటర్ తన పదవికి రాజీనామా చేశారు. వీరిలో ఫిఫా వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ వెబ్ కూడా ఉండటంతో బ్లాటర్ అధ్యక్షపదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన జెఫ్రీ వెబ్ ను ఈ మధ్యనే న్యూయార్క్ కోర్టుకు హాజరయ్యాడు.  జెఫ్రీకి 10 మిలియన్ డాలర్లు (రూ.63 కోట్లు) పూచీకత్తుతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేయడంతో అతను పోలీసుల చెరనుంచి విముక్తి లభించింది.

మరిన్ని వార్తలు