ఫిఫా ప్రపంచకప్‌: సెర్బియా విజయానందం

17 Jun, 2018 20:39 IST|Sakshi
గోల్‌ చేస్తున్న సెర్బియా కెప్టెన్‌ అలెగ్జాండర్‌ కొరలోవ్‌

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సమరా ఎరినా మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా జట్టు 1-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరు జట్లు ప్రథమార్థంలో ఒక్క గోల్‌ నమోదు చేయలేకపోయాయి. ద్వితీయార్థంలో కొంచెం దూకుడు పెంచిన ఇరు జట్లు గోల్‌ కోసం గట్టిగానే ప్రయత్నించాయి. కానీ మ్యాచ్‌లో తొలి గోల్‌ నమోదు కావడానికి 56 నిమిషాలు పట్టింది.

ఫ్రీకిక్‌ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెర్బియా కెప్టెన్‌ అలెగ్జాండర్‌ జట్టుకు తొలి గోల్‌ను  అందించాడు. దీంతో సెర్బియా 1-0తో ఆధీనంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో మరొక గోల్‌ నమోదు కాకపోవడంతో సెర్బియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిఫరీ ఇద్దరు సెర్బియా (ఇవనోవిక్‌, ప్రిజోవిక్‌), ఇద్దరు కోస్టారికా ఆటగాళ్ల(కాల్వొ, గుజ్మన్‌)కు  ఎల్లో కార్డు చూపించారు. నేటి మ్యాచ్‌లో కోస్టారికా 14 అనవసర తప్పిదాలు చేయగా, సెర్బియా 11 తప్పిదాలు చేసింది. 

మరిన్ని వార్తలు