భారత్‌ x అఫ్గానిస్తాన్‌

14 Nov, 2019 02:00 IST|Sakshi

నేడు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2022 క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌

దుశంబే (తజికిస్తాన్‌): ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2022 క్వాలిఫయర్స్‌లో నిలకడలేని ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత జట్టు నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్‌ క్వాలిఫయింగ్‌ను పరాజయంతో మొదలుపెట్టిన భారత్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడినా... ఇంకా గెలుపు బోణీనే కొట్టలేకపోయింది. తొలి మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న ఒమన్‌ చేతిలో 1–2తో ఓడిన భారత్‌ తర్వాత ఆసియా చాంపియన్‌ ఖతర్‌తో 0–0తో డ్రా చేసుకుంది. కోల్‌కతాలో జరిగిన గత మ్యాచ్‌లో, చివరకు దిగువ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్‌తోనూ 1–1తో ‘డ్రా’గా ముగించడం భారత సాకర్‌ అభిమానుల్ని నిరాశపరిచింది.

ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో సొంత ప్రేక్షకుల మధ్య ఓడిపోయే పరిస్థితి తలెత్తింది. చివరకు ఆదిల్‌ ఖాన్‌ (88వ ని.లో) చేసిన హెడర్‌ గోల్‌తో ‘డ్రా’తో గట్టెక్కింది. ప్రస్తుతం గ్రూప్‌ ‘ఇ’లో రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్‌... ఎలాగైనా అఫ్గానిస్తాన్‌ను ఓడించాలనే గట్టిపట్టుదలతో ఉంది. 106 ర్యాంకులో ఉన్న భారత్‌... 149వ ర్యాంకులో ఉన్న అఫ్గాన్‌ కంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. బోణీ కొట్టేందుకు ఇదే సరైన అవకాశం. సునీల్‌ చెత్రి ఆశించిన స్థాయిలో రాణిస్తే విజయం ఏమంత కష్టం కాదు. అదే జరిగితే ఆశావహ దృక్పథంతో మిగతా మ్యాచ్‌లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్మార్ట్‌ వాచ్‌లపై నిషేధం

సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం

కోహ్లి, గుండు కొట్టించుకో: వార్న‌ర్‌

లాక్‌డౌన్‌: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?

రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌