ముందు కోహ్లిని ఔట్‌ చేయండి.. చహల్‌ స్ట్రాంగ్‌ రిప్లై

6 Apr, 2020 15:32 IST|Sakshi

ముంబై: ఇటీవల ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,   ఆ జట్టు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించుకున్న  సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యలో దూరిపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు యజ్వేంద్ర చహల్‌.. తనను ముంబై ఇండియన్స్‌ మిస్‌ అవుతుందా అంటూ మాట కలిపాడు. దీనికి రోహిత్‌కు కూడా తగిన సమాధానమే  ఇచ్చాడు.   ‘ నీ గురించి ఆర్సీబీకి చెబుతాం.. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాలనుకుంటున్నావని ఆర్సీబీ యాజమాన్యానికి తెలియజేస్తా. నీ వేషాలు మీ కెప్టెన్‌ కోహ్లి కూడా చెబుతా. అయినా నిన్ను మిస్‌ అవ్వాల్సిన అవసరం మా జట్టుకు లేదే. మేము గెలవకపోతే నిన్ను మిస్‌ అయినట్లు. మరి మేము గెలుస్తున్నాం కదా బాస్‌’ అంటూ రోహిత్‌ బదులిచ్చాడు. అవును..అవును చహల్‌ విషయం కోహ్లికే చెప్పేల్సిందే అంటూ బుమ్రా ఆ చాట్‌లో రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. (ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?)

ఇదిలా ఉంచితే, తాజాగా ముంబై ఇండియన్స్‌ ఒక ట్వీట్‌ చేసింది.  అందులో చహల్‌ను టార్గెట్‌ చేసింది. తమ జెర్సీలో ఉన్న చహల్‌ ఫొటో పెట్టిన ముంబై.. పక్కనే బుమ్రా బంతిని ఎగరేస్తున్న ఫొటోను పెట్టింది. ఈ క్రమంలో ఒక కామెంట్‌ కూడా చేసింది. ‘ చహల్‌ చూశావా.. నిన్ను ఔట్‌ చేయడానిక బుమ్రా బంతిని ఎలా సానబెడుతున్నాడో.. ఇక ఓవర్‌ ఎలా ఉండబోతుందో ఊహించుకో’ అని కామెంట్‌ను కూడా జత చేసింది. దీనికి ఎంతమాత్రం తగ్గని చహల్‌ కూడా అంతే  తెలివిగా జవాబిచ్చాడు. ‘ నా దాకా బుమ్రా ఓవర్‌ రాదులే. ఎందుకంటే నేను 10 నంబర్‌లోనో, 11 నంబర్‌లోనూ బ్యాటింగ్‌ చేస్తా. ఈలోపు మా బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి, పించ్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌లను బుమ్రాను ఔట్‌ చేయమనండి. మొత్తం మా జట్టును ఔట్‌ చేసిన తర్వాతే నా వద్దకు రావాలి.  అంత వరకూ వస్తే అప్పుడు నా గురించి మాట్లాడుకుందాం. మీరు కలలు కంటూ ఉండండి’ అని చహల్‌ రిప్లే ఇచ్చాడు. (నీకు ఆవేశం ఎక్కువ.. సెట్‌ కావు..!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా