ఇంగ్లండ్ -పాక్ ల తొలి టెస్టు డ్రా

17 Oct, 2015 19:58 IST|Sakshi
ఇంగ్లండ్ -పాక్ ల తొలి టెస్టు డ్రా

అబు దాబి: ఇంగ్లండ్-పాకిస్థాన్ ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. చివరి రోజు ఆటలో పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకే చాపచుట్టేయడంతో  ఇంగ్లండ్ విజయానికి 99 పరుగులు మాత్రమే అవసమయ్యాయి. కాగా, ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించాక 11.0 ఓవర్లు మాత్రమే సాధ్యపడటంతో పాకిస్థాన్ తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఇంగ్లండ్ విజయంపై ఆశలు రేకెత్తించినా చివరకు డ్రా ముగించక తప్పలేదు.

 

ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో మొయిన్ అలీ(11), బట్లర్(4),  స్టోక్స్(2), బెయిర్ స్టో(15) లు పెవిలియన్ కు చేరారు. మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేసే సమయానికి రూట్(33),ఇయాన్ బెల్(5)లు క్రీజ్ లో ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో భాగంగా పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్ ఆటగాళ్లలో మిస్బావుల్ హక్(51), యూనస్ ఖాన్(45), మహ్మద్ హఫీజ్(34) మినహా ఎవరూ రాణించలేదు.


పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 523/8 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 173 ఆలౌట్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 598/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్  74/4

మరిన్ని వార్తలు