పాక్‌దే తొలి వన్డే

28 May, 2015 01:33 IST|Sakshi
పాక్‌దే తొలి వన్డే

పోరాడి ఓడిన జింబాబ్వే
 
లాహోర్ : బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్ (112), హఫీజ్ (86), హారిస్ సోహైల్ (89 నాటౌట్) చెలరేగి ఆడటంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా పాక్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 375 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసి పోరాడి ఓడిం ది. చిగుంబరా (117) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మసకద్జా (73), సికిందర్ రజా (36), విలియమ్స్ (36) మోస్తరుగా ఆడారు. అయితే కీలక సమయంలో పాక్ బౌలర్లు విజృంభించడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. షోయబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై శుక్రవారం జరుగుతుంది.
 
 సానియా ఆనందోత్సాహం
 ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తన భర్త షోయబ్ మాలిక్ సెంచరీ కొట్టడంతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆనందంతో పరవశించిపోతోంది. తన సంతోషాన్ని దాచుకోకుండా ట్విట్టర్‌లో షోయబ్‌కు అభినందనలు తెలిపింది. ‘నీ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది. నమ్మకం అద్భుతాలు చేస్తుంది’ అని ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తలు