టెన్నిస్‌లో ఐదు పతకాలు ఖాయం

28 Sep, 2014 00:57 IST|Sakshi
టెన్నిస్‌లో ఐదు పతకాలు ఖాయం

టెన్నిస్: ఆసియాగేమ్స్ టెన్నిస్‌లో భారత్‌కు కనీసం ఐదు పతకాలు వచ్చినట్లే. ఈ ఈవెంట్‌లో సెమీస్‌లో ఓడినా కాంస్యం వస్తుంది. హైదరాబాద్ క్రీడాకారులు సానియా, సాకేత్ రెండు విభాగాల్లో సెమీస్‌కు చేరి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు.
  పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 6-3, 6-2 తేడాతో దనాయ్ ఉడోమ్‌చోక్ (థాయ్‌లాండ్)పై సునాయాసంగా నెగ్గి సెమీస్‌కు చేరాడు.
  మరో సింగిల్స్‌లో సనమ్ సింగ్ 6-7 (3/7), 4-6తో సున్ యెన్ లు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
  పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడి 6-2, 7-6 (12/10) తేడాతో టి చెన్, సీన్ యిన్ పెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి సెమీస్‌కు చేరింది.
  మరో డబుల్స్‌లో యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్ జోడి 7-5, 7-6 (7/1)తేడాతో సిన్ హాన్ లీ, యు జూ వాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి సెమీస్‌కు చేరింది.
  మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా మీర్జా, సాకేత్ మైనేని 6-3, 7-6 (7/4)తేడాతో కొరియాకు చెందిన నలే హాన్, చియోంగీ కిమ్‌ను వరుస సెట్లలో మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టారు.
  మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా మీర్జా, ప్రార్థన తొంబారే జంట 6-1, 7-6 (7/4)తో పియాంగ్‌టర్న్, నిచాపై నెగ్గి సెమీస్‌లో ప్రవేశించింది.
 టేబుల్ టెన్నిస్: పురుషుల, మహిళల జట్లు తమ ప్రిలిమినరీ రౌండ్లలో విజయాలు సాధించి సత్తా చాటుకున్నాయి.



 

మరిన్ని వార్తలు