కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ

14 Apr, 2018 16:36 IST|Sakshi

కోల్‌కతా : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌లో మ‍్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. యువ పేసర్‌ కమలేశ్‌ నాగర్‌ కోటి పాదం గాయం కారణంగా మొత్తం ఐపీఎల్‌ టోర్నీకి దూరమయ్యాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో పదునైన బంతులతో కమలేశ్‌ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్‌ వేలంలో ప్రాంచైజీలు యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పెట్టి కోల్‌కతా దక్కించుకుంది. అయితే ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే కమలేశ్‌ను గాయం బాధిస్తూ వచ్చింది.

ఈ క్రమంలో త్వరగా కోలుకుని టోర్నీలో పాల్గొంటాడని భావించిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కమలేశ్‌ నాగర్‌కోటి  ఐపీఎల్‌ 11 సీజన్‌ మొత్తానికి దూరమైనట్టు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో అతని స్థానంలో కర్ణాటక ఆటగాడు ప్రసిద్‌ క్రిష్ణను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ జట్టు యాజమాన్యం ఇంకా ధ్రువీకరించలేదు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు కోల్‌కతా ఓ విజయం అందుకోగా, తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు