ఆ రోజుల్ని మరచిపోతారు: రషీద్‌ ఖాన్‌

21 Jun, 2019 20:39 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేయడంతో తనపై వస్తున్న విమర్శలకు అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ స్పందించాడు. ఎన్ని మంచి ప్రదర్శనలు చేసినా, ఏదో ఒక సందర్భంలో పేలవ ప్రదర్శన చేస్తే విమర్శలు రావడం సర్వ సాధారణమేనన్నాడు. తాను అద్భుతమైన ప్రదర్శన చేసిన రోజుల్ని మరచిపోయి మరీ ఇంతటి స్థాయిలో విమర్శించడాన్ని తనదైన శైలిలో చమత్కరించాడు రషీద్‌. ‘ నేను మంచి ప్రదర్శన చేసిన రోజులు ఇప్పుడు గతం. ఒక్క చెత్త ప్రదర్శన చేస్తే పది మంచి ప్రదర్శన చేసిన రోజులు గతించిపోతాయి. వాటిని ప్రజలు మరచిపోవడం సర్వసాధారణం. మనం పేలవ ప్రదర్శన చేస్తే ఉత్తమ  ప్రదర్శన చేసిన రోజులు గుర్తుకురావు. దాన్ని గుర్తుకుతెచ్చుకోవానికి ఎవరూ ఇష్టపడరు.

ఆ మ్యాచ్‌కు కోసం నేను కూడా పెద్దగా ఆలోచించడం లేదు. . నాపై వస్తున్న విమర్శల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ చేసిన తప్పిదాలు మరోసారి జరగకుండా చూసుకోవడమే నా ముందున్న లక్ష్యం’ అని రషీద్‌ తెలిపాడు. శనివారం భారత్‌తో మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో రషీద్‌ మీడియాతో మాట్లాడాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి తనవంతు కృషి చేస్తానన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 9 ఓవర్లు వేసి 110 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఒక ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ అయిన రషీద్‌ ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చి చెత్త రికార్డును మూటగట్టుకోవడంపై విమర్శల వర్షం కురిసింది.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు