ఠాకూర్‌.. క్షమాపణ చెప్పు

8 Jul, 2017 01:25 IST|Sakshi
ఠాకూర్‌.. క్షమాపణ చెప్పు

సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కోర్టు ఉల్లంఘన కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా అయితేనే ఆయనపై ఉన్న కేసు నుంచి ఉపశమనం పొందుతారని తేల్చింది.

గతంలో ఠాకూర్‌ దాఖలు చేసిన క్షమాపణ పత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, మరోసారి స్పష్టమైన పద్ధతిలో ఎలాంటి షరుతుల్లేని క్షమాపణ కోరుతూ ఒక పేజీతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, ఏఎమ్‌ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. అలాగే ఈనెల 14న జరిగే తదుపరి విచారణకు ఆయన స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు