ఐపీఎల్‌: ఆమెనే బెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌!

27 May, 2018 10:28 IST|Sakshi
స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ మయాంతి లాంగర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)  మ్యాచ్‌లు చూసేవారికి ఆమె సుపరిచితురాలు. ప్రతిరోజు ప్రత్యర్థి జట్లు మారతాయి. కానీ మ్యాచ్‌ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌, కామెంటెటర్‌ మయాంతి లాంగర్‌. టీమిండియా క్రికెటర్‌ స్టూవర్ట్‌ బిన్నీ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా, ప్రస్తుతం తన ప్రొఫెషనల్‌ వర్క్‌తో ఆమె ఆకట్టుకుంటున్నారు. మయాంతిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కామెంటెటర్‌ డీన్‌ జోన్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. 

ఐపీఎల్‌లో తాను ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ అందరిలోనూ మయాంతి లాంగర్‌ బెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌ అని కితాబిచ్చారు. ఆమె తన వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో ఉంటారని, గ్రేట్‌ జాబ్‌ మయాంతి అని ట్వీట్‌లో రాసుకొచ్చారు మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌. ఐపీఎల్‌లో మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగే చర్చలో ఆమె తన విలువైన అభిప్రాయాలను షేర్‌ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. యాంకర్‌, కామెంటెటర్‌ మయాంతి లాంగర్‌ భర్తే క్రికెటర్‌ బిన్నీ అంటూ నెటిజన్లు తరచుగా కామెంట్లు చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు