మాజీ క్రికెటర్‌ సలీమ్‌ కన్నుమూత

23 Aug, 2019 10:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ రంజీ క్రికెటర్‌ సుల్తాన్‌ సలీమ్‌ బుధవారం కన్ను మూశారు. 1962–1975 మధ్య కాలంలో ఆయన హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర జట్టు తరఫున కూడా రంజీ ట్రోఫీ ఆడారు. 44 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 20.43 సగటుతో సలీమ్‌ 1124 పరుగులు చేశారు. ఇందులో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి.

హైదరాబాద్‌కు ఆడిన సమయంలో టైగర్‌ పటౌడీ, ఎంఎల్‌ జైసింహ, ఆబిద్‌ అలీ ఆయన సహచరులు. ఆల్‌ సెయింట్స్‌ తరఫున స్కూల్‌ క్రికెట్‌ ఆడిన సమయంలో ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో 201, 312 పరుగులు చేసిన ఘనత సలీమ్‌ సొంతం. సుల్తాన్‌ సలీమ్‌ మృతి పట్ల హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.   

మరిన్ని వార్తలు