జీవనోపాధి కోసం వ్యాన్‌ డ్రైవర్‌గా మారిన క్రికెటర్‌..

15 Oct, 2019 16:17 IST|Sakshi

కరాచీ: జీవనోపాధి కోసం ఒక క్రికెటర్‌ కాస్తా వ్యాన్‌ డ్రైవర్‌గా మారాడు. పాకిస్తాన్‌ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్‌ ఫజాల్‌ షుబాన్‌ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్‌ నడుపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌ క్రికెట్‌లో తీసుకొచ్చిన నూతన విధానం వల్ల డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌కు చరమగీతం పాడారని, దాంతోనే తాను ఇలా రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున ఆడటానికి చాలా శ్రమించా. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఉన్న డిపార్ట్‌మెంటల్‌ క్రికెట్‌లో ఆడా. దాంతో రూ. లక్ష వరకూ జీతంగా వచ్చేది. కానీ వాటిని మూసేయడంతో ఇప్పుడు వ్యాన్‌ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు నా సంపాదన 30 వేల నుంచి 35 వేల వరకూ మాత్రమే ఉంది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. అయినా సంతోషంగానే ఉన్నా’ అని ఫజాల్‌ పేర్కొన్నాడు.

కాగా, ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత తన ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు పాకిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌. పాకిస్తాన్‌ క్రికెట్‌ తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల చాలా మంది ఇలా వీదిన పడ్డారు. ఇది చాలా బాధాకరం. ఈ పాలసీ వల్ల 200 మంది మాత్రమే లబ్ది పొందే అవకాశం ఉండగా వేల సంఖ్యలో దేశవాళీ క్రికెటర్లు ఉద్యోగాలు లేకుండా పోయారు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది అయితే నాకు కచ్చితంగా తెలియదు. ఇలా క్రికెటర్లు ఉద్యోగాలు లేకండా బాధితులుగా మారిపోయారు’ అంటూ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా