భారత కోచ్‌గా ఐగర్‌ స్టిమాక్‌ 

10 May, 2019 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రొయేషియాకు చెందిన ఐగర్‌ స్టిమాక్‌ భారత ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. గురువారం ఇక్కడ సమావేశమైన అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం స్టిమాక్‌తో పాటు లీ మిన్‌ సంగ్‌ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్‌ రోకా (స్పెయిన్‌), హకాన్‌ ఎరిక్సన్‌ (స్వీడన్‌)తో దరఖాస్తు చేశారు. వీరిలో స్టిమాక్‌ నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. మిగతావారు స్కైప్‌ ద్వారా మాట్లాడారు.

అనంతరం సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... స్టిమాక్‌ వైపు మొగ్గింది. 51 ఏళ్ల స్టిమాక్‌ సెంటర్‌బ్యాక్‌గా 53 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. 1996 యూరో కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012–13 మధ్య తమ దేశ జటు కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలోనే క్రొయేషి యా 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. స్టిమాక్‌ మూడేళ్ల పాటు భారత కోచ్‌గా ఉండనున్నాడు. థాయ్‌లాండ్‌లో జూన్‌ 5 నుంచి జరుగనున్న కింగ్స్‌ కప్‌తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది. 

మరిన్ని వార్తలు