‘రూట్‌.. కోహ్లిని చూసి నేర్చుకో’

8 Oct, 2018 15:43 IST|Sakshi

లండన్‌: బ్యాటింగ్ విషయంలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్ జో రూట్... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి నేర‍్చుకోవాల్సిన అంశం ఒకటి ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రార్లీ సూచించాడు. ఆధునిక క్రికెట్‌లో  వీరిద్దరూ దిగ్గజ క్రికెటర్లుగా వెలుగొందుతున్నప్పటికీ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తున్నసరాసరి విషయంలో జోరూట్‌తో పోలిస్తే కోహ్లిదే అధికంగా ఉందన్నాడు. ఇక్కడ కోహ్లి తన హాఫ్‌ సెంచరీలను సెంచరీలు ఎలా మలుస్తున్నాడు అనేది రూట్‌ నేర్చుకోవాల్సి ఉందన్నాడు.

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తున్నరేట్ శాతం 59 నుంచి 60 వరకూ ఉంది. అదే రూట్ విషయంలో 25 శాతంగా ఉంది. ఇది గమనించాల్సిన విషయం. ప్రస్తుత క్రికెట్‌ పరంగా చూస్తే అత్యుత్తమ ఆటగాళ్లలో ఐదు లేదా నలుగురు ఆటగాళ్లలో వీరిద్దరూ ఉన్నారు. రూట్‌ ఒక అసాధారణ బ్యాట్స్‌మన్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో రూట్‌ ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది కాలంగా రూట్‌ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. షాట్ల ఎంపికలో జో రూట్ మరింత పరిణితి చూపించాల్సి ఉంటుంది. 70ల్లో ఉన్నప్పుడు జో రూట్ షాట్ల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహారించాలి. అదే సమయంలో కోహ్లి హాఫ్‌ సెంచరీలను సులువుగా సెంచరీలుగా మలచుకుంటున్నాడు. ఈ విషయంలో కోహ్లిని చూసి రూట్‌ తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ’ అని బ్రార్లీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు