‘రూత్... మాకు తీరని శోకాన్ని మిగిల్చింది’

29 Dec, 2018 21:02 IST|Sakshi
భార్యతో ఆండ్రూ స్ట్రాస్‌ (పాత చిత్రం)

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ భార్య రూత్‌ స్ట్రాస్‌(46) కన్నుమూశారు. గత కొంత కాలంగా లంగ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె శనివారం మరణించినట్లు స్ట్రాస్‌ కుటుంబం తెలిపింది. ‘మహమ్మారి క్యాన్సర్‌ బారిన పడిన రూత్‌ మమ్మల్ని శాశ్వతంగా విడిచివెళ్లింది. మాకు తీరని శోకాన్ని మిగిల్చింది. నాతో పాటుగా సామ్‌, లుకా తనని ఎంతగానో మిస్సవుతారు. రూత్‌ను కలిసిన ప్రతీ ఒక్కరికీ తన ఎంత స్నేహభావం కలదో ఇట్టే తెలిసిపోయేది. గత 12 నెలలుగా తన చికిత్సకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తన పేరిట ఫౌండేషన్‌ నెలకొల్పి క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలుస్తాం’ అంటూ ఆండ్రూ స్ట్రాస్‌ తరఫున ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా ఆస్ట్రేలియాకు చెందిన రూత్‌.. 2003లో ఆండ్రూ స్ట్రాస్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సామ్‌, లుకా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2017లో ఆమెకు క్యాన్సర్‌ సోకింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌, గోల్ఫ్‌ ప్లేయర్‌ ల్యూక్‌ డొనాల్డ్‌ తదితరులు రూత్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్‌ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు