బాపు నాదకర్ణి కన్నుమూత

18 Jan, 2020 04:15 IST|Sakshi

ముంబై: భారత మాజీ క్రికెటర్‌ బాపు నాదకర్ణి (86) శుక్రవారం కన్ను మూశారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955–1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 88 వికెట్లు పడగొట్టారు. 1414 పరుగులు చేశారు. 1964లో మద్రాసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 32 ఓవర్లలో 27 మెయిడిన్లు కాగా 5 పరుగులు మాత్రమే (32–27–5–0) ఇచ్చారు. ఇందులో వరుసగా 21 మెయిడిన్‌ ఓవర్లు ఉండటం ఒక అరుదైన రికార్డుగా నమోదైంది. 

మరిన్ని వార్తలు