అరుణ్ లాల్ దవడ క్యాన్సర్కు చికిత్స

23 Apr, 2016 20:11 IST|Sakshi

కోల్కతా: ఇటీవల దవడ క్యాన్సర్ బారిన పడ్డ భారత మాజీ క్రికెటర్,  ప్రముఖ వ్యాఖ్యాత అరుణ్ లాల్ కు శనివారం కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేశారు. అరుణ్ లాల్కు 14 గంటల పాటు సర్జరీ చేసిన అనంతరం దవడ మార్పిడి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతున్నట్లు అరుణ్ లాల్ పేర్కొన్నారు.


ఈ ఏడాది జనవరి నెలలో ఆయన దవడకు క్యాన్సర్ సోకడంతో అప్పట్నుంచి చికిత్స తీసుకుంటూ కామెంటరీ తదితర వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు అరుణ్ లాల్ కు చికిత్స అనంతరం ఆయన ప్రముఖ జాతీయ వార్తా పత్రికతో మాట్లాడారు. ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ అని, సరైన సమయంలో గుర్తించడం వల్లే చికిత్స సాధ్యపడిందన్నాడు. ఈ సందర్భంగా కొత్త జీవితం ప్రసాదించిన  భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాను తిరిగి యథాస్థితికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చికిత్స అత్యంత క్లిష్టమైనదని, డాక్టర్లు తమ కర్తవ్యాన్ని అమోఘంగా నిర్వహించి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు.

మరిన్ని వార్తలు