భారత మాజీ ఫుట్‌బాలర్‌ అబ్దుల్‌ లతీఫ్‌ కన్నుమూత

26 Mar, 2020 06:46 IST|Sakshi

గువాహటి: భారత దిగ్గజ మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అబ్దుల్‌ లతీఫ్‌ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) సంతాపం తెలిపింది. ‘అబ్దుల్‌ లతీఫ్‌ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివి’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ అ«ధ్యక్షులు ప్రఫుల్‌ పటేల్‌ పేర్కొన్నారు. 1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్‌... 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్‌ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్‌కు ప్రాతిని«ధ్యం వహించారు. వీటితో పాటు కోల్‌కతా విఖ్యాత క్లబ్‌లు మోహన్‌ బగాన్, మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ జట్లకూ తన సేవలు అందించారు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది.   

మరిన్ని వార్తలు