పాక్‌ క్రికెట్‌లో కరోనా కలకలం

13 Jun, 2020 14:36 IST|Sakshi

ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి శనివారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అఫ్రిది స్వయంగా వెల్లడించారు. మరో ఇద్దరు క్రికెటర్లు తౌఫీర్‌ ఉమర్‌, జఫర్‌ సర్ఫరాజ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాక్‌ క్రికెట్‌లో కరోనా కలకలం రేపింది. ముందస్తు జాగ్రత్తగా మరికొంతమంది ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 1 లక్షా 32 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 2600కి చేరింది. కాగా కశ్మీర్‌ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అఫ్రిది ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కామెంట్లపై భారత క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు. 

ఇక్కడ చదవండి: మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం

‘కశ్మీర్‌ను వదిలేయ్‌.. నీ విఫల దేశాన్ని చూసుకో’

మరిన్ని వార్తలు