దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మృతి

13 Dec, 2016 16:08 IST|Sakshi
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మృతి

కేప్టౌన్:దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ సిడ్ ఓ లిన్(89) కన్నుమూశారు. ఆదివారం కేప్టౌన్లో  ఓలిన్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.1960-61 కాలంలో ఏడు టెస్టు మ్యాచ్లను మాత్రమే ఓలిన్ తన కెరీర్లో ఆడారు.  దాదాపు 92 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఓలిన్ 35.62 సగటుతో 4,525 పరుగులు చేశాడు. ట్రాన్స్ వాల్, వెస్ట్రన్ ప్రొవెన్సీ, కెంట్ల తరపున ఓలిన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. స్వతహాగా వికెట్ కీపర్ అయిన ఓలిన్ మంచి ఫీల్డర్ కూడా కావడంతో అతను చాలా మ్యాచ్ల్లో కీలక పాయింట్లలో ఫీల్డింగ్ చేసేవాడు.  

1960లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టులో తొలిసారి ఈ ఓపెనర్కు అవకాశం దక్కింది. ఆ సీజన్ లో ట్రాన్స్ వాల్ తరపున ఓలిన్ 68.78 సగటుతో 619 పరుగులు చేయడంతో అతనికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టులో అవకాశం కల్పించారు. ఇంగ్లండ్ టూర్లో ఓలిన్ నమోదు చేసిన 98 పరుగులే అతని అత్యధిక స్కోరు. అనంతరం న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సైతం ఓలిన్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ పర్యటన తరువాత ఓలిన్ పేలవమైన ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

>
మరిన్ని వార్తలు