ఫిఫా సమరం: మెస్సీ కథ ముగిసింది

30 Jun, 2018 21:28 IST|Sakshi
నిరాశలో మెస్సీ

మాస్కో: ఫుట్‌బాల్‌ దిగ్గజం.. అభిమానుల ఆరాధ్య దైవం లియోనల్‌ మెస్సీ పోరాటం ముగిసింది. శనివారం ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్‌ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్‌ దశలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్‌ తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న  కైలియన్‌ ఎంబాపె వరుసగా రెండు అద్భుత గోల్స్‌ అందించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఒత్తిడికిలోనైన ఆర్జెంటీనా ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. 68వ నిమిషంలో లభించిన పెనాల్టీ సాకర్యాన్నీ మెస్సీ వృథా చేశాడు. 

తొలి అర్థబాగం వరకు ఇరు జట్లు సముతుకంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్‌ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ 13వ నిమిషంలో తొలి గోల్‌ నమోదు చేశాడు. అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియా 41 వ నిమిషంలో గోల్‌ చేయడంతో స్కోర్స్‌ సమమయ్యాయి. ఇక బ్రేక్‌ అనంతరం అర్జెంటీనా ఆటగాడు గాబ్రియేల్ మెర్కాడో 48వ నిమిషంలో గోల్‌ చేశాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యం సాధించింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ పెవార్డ్‌ గోల్‌ అందించడంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఎంబాపె 64, 68వ నిమిషంలో స్టన్నింగ్‌ గోల్స్‌ అందించడంతో అర్జెంటీనా కోలుకోలేకపోయింది. చివర్లో మెర్కాడో గోల్‌ సాధించినా అర్జెంటీనా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.

మరిన్ని వార్తలు