ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌!

11 May, 2020 02:58 IST|Sakshi

పారిస్‌: ప్రేక్షకులు లేకుండానే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరిగే అవకాశం ఉందని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌ఎఫ్‌టీ) చీఫ్‌ బెర్నార్డ్‌ గైడిసెల్లి తెలిపారు. దాంతో ప్రతి ఏటా టోర్నీని కోర్టుల్లో ప్రత్యక్షంగా తిలకించే ఐదు లక్షలకుపైగా టెన్నిస్‌ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. అన్నివిధాలా ఆలోచించే టోర్నీని నాలుగు నెలలపాటు వాయిదా వేశామన్నారు. నిజానికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఈ నెల 24న ఆరంభం కావాల్సి ఉండగా... కరోనా కారణంగా సెప్టెంబర్‌ మూడో వారానికి వాయిదా వేశారు. ‘టోర్నీ నిర్వహణే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ టోర్నీని టీవీల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్‌ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా... ఖాళీ స్టాండ్స్‌తో మ్యాచ్‌లను నిర్వహిస్తాం’అని బెర్నార్డ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు