ఫ్రెంచ్‌ ఓపెన్‌ టికెట్ల డబ్బులు వాపస్‌ 

8 May, 2020 09:48 IST|Sakshi

పారిస్‌: ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీని ప్రత్యక్షంగా తిలకించడం కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు టికెట్‌ వెల మొత్తాన్ని రిఫండ్‌ చేయనున్నట్లు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్‌) గురువారం ప్రకటించింది. నిజానికి మే 24 నుంచి జూన్‌ 7 మరకు జరగాల్సిన ఈ టోర్నీని కరోనా మహమ్మారి వల్ల సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లను కొన్న ప్రేక్షకులకు డబ్బును తిరిగి చెల్లించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 4 కు మారిన షెడ్యూల్‌ ప్రకారం చేపట్టే టికెట్ల విక్రయాన్ని ఈవెంట్‌కు ముందు వెల్లడిస్తామని ఎఫ్‌టీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌... వింబుల్డన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా