వెల్‌డన్‌.. టాప్‌ స్టార్‌..!

26 Aug, 2019 11:11 IST|Sakshi
టీవీలో పీవీ సింధు విజయోత్సవాన్ని తిలకిస్తున్న కుటుంబ సభ్యులు

పీవీ సింధు విక్టరీతో మురిసిన సిటీ

యువతరానికి ఆదర్శమంటూ ట్వీట్స్‌

సాక్షి, సిటీబ్యూరో: విశ్వ విజేతగా నిలిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధుపై నగర వాసులు అభినందన జల్లులు కురిపించారు.హైదరాబాదీ స్టైల్‌తో దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని తోటి క్రీడాకారులు, ఆమె క్లాస్‌మేట్‌లు కొనియాడారు. సింధు ఇప్పుడు మరింత మందికి రోల్‌మాడల్‌ అయ్యారంటూ వందల కొద్ది ట్వీట్‌లువెల్లువెత్తాయి. పలువురు  నగర ప్రముఖులు కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు.

శభాష్‌ సింధు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీభారత్‌ చరిత్రలో తొలిసారి షటిల్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పీవీ సింధుకు అభినందనలు. భారత జాతి పోరాట పటిమకు పీవీ సింధు నిదర్శనం.

గణపతి ఆశీస్సులతో..: దొర రాజు,  ‘ఆలివ్‌’ నిర్వాహకులు టోర్నీకి వెళ్లే ముందు సింధు ‘ఆలివ్‌’ మట్టి గణపతిని ఆవిష్కరించారు. దాంతో విఘ్నాలన్నీ తొలగిపోయి...ఆమె ఘన విజయం సులభమైంది. హ్యాట్సాఫ్‌ సింధు.

కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు: దగ్గుబాటి సురేష్, సినీ నిర్మాత మన తెలుగు అమ్మాయి ప్రపంచ కప్‌ను గెలిచి భారత జెండాను ఎగురవేయడం  మనందరికి చాలా గర్వకారణం. ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆమె ఓటమి చెందినప్పుడు నిరుత్సాహపడకుండా హార్డ్‌ వర్క్‌తో ప్రాక్టీస్‌ చేసి చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

గర్వంగా ఉంది 
సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ విజేతగా నిలవడంచాలా గర్వంగా ఉంది. నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన అమ్మాయి ప్రపంచ స్థాయి వేదికలలో గెలవడం సంతోషాన్నిచ్చింది. – వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌

మరిన్ని వార్తలు