ఫఖర్‌ జమాన్‌పై జోక్సే జోక్స్‌!

24 Sep, 2018 15:46 IST|Sakshi

దుబాయ్ : పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌పై సోషల్‌ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్‌ వినూత్నంగా పెవిలియన్‌ చేరాడు. కుల్దీప్‌ వేసిన 14వ ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్‌ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్‌ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై సందిగ్ధం వ్యక్తం చేస్తూ నాన్‌ స్ట్రైకర్‌ను అడగ్గా అతను ఏం చెప్పకపోవడంతో ఫఖర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్‌కు తాకిందని తేలింది. అప్పీల్‌కు వెళితే ఫఖర్‌ బతికిపోయేవాడు. దీంతో అభిమానులు కిందపడిపోయిన ఫఖర్‌ సీన్‌పై ఫన్నీ మేమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు.

‘ఫఖర్‌.. ధావన్‌ కోసం పిచ్‌ శుభ్రం చేస్తున్నావా?’ అని ఒకరు.. ఫఖర్‌ను వెంటనే జింబాంబ్వే పంపించాలని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు. బ్యాటింగ్‌ చేయమంటే ఫఖర్‌ మాధురీ దీక్షిత్‌లా డ్యాన్స్‌ చేస్తున్నాడని, స్వచ్ఛ భారత్‌ ప్రచారంలో భాగంగా ఫఖార్‌ తనవంతు కృషిచేస్తున్నారని ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో నెగ్గితే పాక్‌ ఫైనల్లో మరోసారి భారత్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు