హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!

27 May, 2017 16:18 IST|Sakshi
హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సీజన్‌ 10లో అద్భుత ఆటతీరు కనబరచిన యువ క్రికెటర్లలో రిషబ్‌ పంత్‌ ఒకడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడిన పంత్‌ 14 మ్యాచ్‌లలో 366 పరుగులు సాధించాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు పంత్‌. వీడియోలో మెర్సిడెజ్‌ బెంజ్‌ జీఎల్‌సీ ఎస్‌యూవీ కారును 125 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో నడుపుతున్నట్లు ఉంది.

అయితే, పంత్‌ ఆనందం కోసం చేసిన పని విమర్శకులకు దారి తీసింది. ఢిల్లీ వీధుల్లో అత్యధిక వేగంతో వాహనాలను నడపకూడదు. దీంతో పంత్‌ నిర్లక్ష్యంపై కొందరు విమర్శలు చేశారు. హద్దులు మీరకున్నంత వరకే ముద్దని అంటున్నారు.

 

❤❤ #NewCar @rishabpant

A post shared by Rishabh Pant FAN Culb (@rishabpant777) on

మరిన్ని వార్తలు