గంభీర్‌ సాయం రూ. 50 లక్షలు

24 Mar, 2020 10:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌ పై పోరాటం చేస్తోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 400కు పైగా చేరుకోగా, ఇప్పటి వరకు 9 మంది ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించగా, చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇక, పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు మద్దతు ప్రకటించారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటిస్తున్నారు.  కరోనా వైరస్‌పై పోరుకు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ తనవంతు మద్దతు ప్రకటించాడు. (కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం)

ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. అవసరమైన పరికాల గురించి తనకు తెలియజేయాల్సిందిగా కోరాడు.ఇక క్వారంటైన్‌ మార్గదర్శకాలను పాటించకపోతే జైల్లో పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించాడు.. కరోనా వైరస్‌ను మరింత విస్తృతం కాకుండా కట్టడి చేయాలంటే నిబంధనలు అతిక్రమించే వారికి ఇదే సరైన చర్య అని తెలిపాడు.  

మరిన్ని వార్తలు