ఇదేం కూర్పు?: గంగూలీ

25 Aug, 2019 12:04 IST|Sakshi

కోల్‌కతా:  వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా టీమిండియా తుది జట్టు కూర్పుపై మాజీ కెప్టెన్‌ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రధానంగా రోహిత్‌ శర్మ, రవి చంద్రన్‌ అశ్విన్‌లను తుది జట్టులోకి తీసుకోపోవడాన్ని గంగూలీ తప్పుబట్టాడు. తాను రోహిత్‌, అశ్విన్‌లు ఉంటారనే అనుకున్నానని, కానీ అలా మ్యాచ్‌కు సిద్ధం కాలేకపోవడంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో సిద్ధం కావడం సరైనదే కానీ, స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు కల్పించకపోవడం ఎంతమాత్రం సరైనది కాదన్నాడు.

విండీస్‌పై అశ్విన్‌కు మంచి రికార్డు ఉన్న నేపథ్యంలో అతన్ని పక్కకు పెట్టడం సరైన నిర్ణయం కాదన్నాడు. మరొకవైపు రోహిత్‌ను పక్కకు పెట్టి మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయడం కూడా అనాలోచిత నిర్ణయమేనన్నాడు. అదే సమయంలో స్పెషలిస్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను సైతం ఎంపిక చేయకపోవడం కూడా తప్పిదమేనన్నాడు. చివరగా ఆసీస్‌తో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్‌ ఐదు వికెట్లతో రాణించిన విషయాన్ని గంగూలీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

టెస్టు మ్యాచ్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా పంపాలని గంగూలీ సూచించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను టెస్టుల్లో ఓపెనర్‌గా దింపి ప్రయోగం చేయాలన్నాడు.

>
మరిన్ని వార్తలు