సచిన్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడు...

4 May, 2016 19:06 IST|Sakshi
సచిన్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడు...

కోల్‌కతా: రియోడిజనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ నియామకంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తంచేశాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయాన్ని సమ్మతిస్తున్నట్లు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన వాళ్లలో ఒకరైన సచిన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి గంగూలీ తన మద్ధతు ప్రకటించాడు. తన నిర్ణయం ఏంటి అని ఎప్పుడూ అడుగుతుంటారని, ప్రతి విషయం మీద అభిప్రాయాలు ఇవ్వడాన్ని తాను నమ్మనని టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడైన గంగూలీ అభిప్రాయపడ్డాడు. అందుకే అలాంటి వాటిని పక్కనపెట్టి ముందుగా ఎంపికైన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడమే ఉత్తమ బాధ్యత అన్నాడు.

'సచిన్ దేశం కోసం ఇప్పటివరకూ ఎంతో చేశాడు. అతడు అద్భుతాలు చేసినందున నేడు భారత్ తరఫున రియో ఒలింపిక్స్ కు గానూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఐఓఏ నిర్ణయం సరైనది' అని గంగూలీ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. సల్మాన్ కు కూడా ఆ హోదా దక్కడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రియోలో గ్లామర్ తీసుకొస్తాడంటూ మద్ధతుగా గంగూలీ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు