క్వారంటైన్‌లో నువ్వు.. బయట నేను!

17 Mar, 2020 15:50 IST|Sakshi

మనిద్దర్నీ కరోనా వేరు చేసింది..!

ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి భార్య ఆవేదన

మాడ్రిడ్‌: ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఎజ్విక్వైల్‌ గారే (33)కు కరోనా సోకింది. లా లీగా లీగ్‌లో వెలెన్సియా తరఫున ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌ గారే కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్‌ జరగాల్సిన ఉన్న లా లీగాకు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్‌ సోకింది.  స్పెయిన్‌లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9,190 కరోనా కేసులు నమోదవగా.. అందులో 300కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(కరోనా వైరస్‌ ఓ సునామీ)

భార్య భావోద్వేగ ఫొటో
ఎజ్విక్వైల్‌ గారే కరోనా బారిన పడటంతో అతని భార్య తమరా గోర్రో ఆవేదన వ్యక్తం చేశారు. గారేను ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో క్వారంటైన్‌ (నిర్భంధం)లో ఉంచిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా మనిద్దరికీ అడ్డుగోడలా నిలిచి సెపరేట్‌ చేసిందంటూ భావోద్వేగ ఫోటో పెట్టారు. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫోటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గారే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ చదవండి:గ్రాండ్‌ ప్రిన్సెస్‌’లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయులు

కరోనా సోకి యువ కోచ్‌ మృతి

❤️JUNTOS EN LA DISTANCIA❤️ (Eze lleva mascarilla por recomendación médica) #mamamolona #quedateencasa #otroreto #👑

A post shared by Tamara Gorro (@tamara_gorro) on

మరిన్ని వార్తలు