విండీస్ బోర్డును రద్దు చేయండి

21 Apr, 2016 00:36 IST|Sakshi
విండీస్ బోర్డును రద్దు చేయండి

గ్రెనెడా: తమ దేశ క్రికెట్ బోర్డును వెంటనే రద్దు చేయాలని వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డుకు జవాబుదారీతనం లేదని, దీనివల్ల క్రికెట్ పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు.

ప్రస్తుతం ఉన్న బోర్డు డెరైక్టర్లంతా వెంటనే రాజీనామా చేసి, మద్యంతర బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశంలో బీసీసీఐ శక్తివంతమైన బోర్డే అయినా, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తుందని... కానీ వెస్టిండీస్‌లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు.

మరిన్ని వార్తలు