గౌరవ్‌కు చివరి అవకాశం

23 Apr, 2014 01:01 IST|Sakshi

యూత్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ
 న్యూఢిల్లీ: యూత్ ఒలింపిక్ క్రీడలకు అర్హత పొందేందుకు భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకికి మరో అవకాశం మిగిలి ఉంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను యూత్ ఒలింపిక్ క్రీడల అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు.
 
 ఈ మెగా ఈవెంట్‌లో గౌరవ్ సోలంకి 52 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. సెమీఫైనల్‌కు చేరుకున్న నలుగురు బాక్సర్లు యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతారు. క్వార్టర్స్‌లో ఓడిన మిగతా నలుగురి నుంచి ఇద్దరికి యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది.  గౌరవ్ సోలంకి మిగిలిన ఒక బెర్త్ కోసం కార్లోస్ సిల్వాతో తలపడతాడు. ఈ బౌట్‌లో నెగ్గినవారు యూత్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారు.
 
 నేడు శ్యామ్ సెమీఫైనల్
 ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బుధవారం కీలకపోరులో బరిలోకి దిగనున్నాడు. కజకిస్థాన్ బాక్సర్ శాల్కర్ అఖిన్‌బేతో శ్యామ్ సెమీఫైనల్లో పోటీపడనున్నాడు. ఒకవేళ సెమీస్‌లో శ్యామ్ ఓడితే కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు