పాక్‌ నిజస్వరూపం బయటపడింది: గంభీర్‌

27 Dec, 2019 18:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పాక్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియాపై వివక్ష చూపారన్న షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యలపై భారత మాజీ  క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. షోయబ్‌ క్రికెట్‌ ఆడే రోజుల్లో మతం, కులం, ప్రాంతం ఆధారంగా వివక్ష ఎక్కువగా కనబడేదని షోయబ్‌ చెప్పిన విషయాన్ని గౌతమ్‌ గుర్తు చేశాడు. కనేరియా హిందూ అనే కారణంతో తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయని గౌతమ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెటర్‌  ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న దేశంలో ఇలాంటి వివక్షకు గురవ్వడం శోచనీయమన్నాడు.

కనేరియా పాక్‌ టెస్ట్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా కొనసాగిన సమయంలో ..అతని పట్ల వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు. భారత్‌లో మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు గౌరవం ఇచ్చిందన్నారు. మునాఫ్ పటేల్ తనకు అత్యంత సన్నిహితుడని..​ దేశం గర్వించేలా మేమందరం ఒకే జట్టుగా ఆడామని తెలిపాడు. తాజాగా వస్తున్న ఆరోపణల దృష్యా పాక్‌ నిజస్వరూపం బయటపడిందని గంభీర్‌ తెలిపాడు.

ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష ఎదురయితే పాక్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు ఇతర మైనారిటీలు ఏ విధమైన వివక్షకు గురవుతారో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మామ అనిల్ దల్పత్ తర్వాత పాక్‌ తరఫున ఆడిన ఏకైక హిందూ క్రికెటర్‌ దానిష్‌ కనేరియా అని గంబీర్‌ కొనియాడాడు. కనేరియా 61 టెస్టుల్లో  261 వికెట్లు, 18 వన్డేలలో 15వికెట్లు పడగొట్టాడు.
చదవండి: అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్‌

మరిన్ని వార్తలు