ఓడిపోతే నిందించొద్దు మరి: గంభీర్‌

18 Mar, 2019 19:17 IST|Sakshi
గౌతం గంభీర్‌

పాక్‌తో మ్యాచ్‌ కన్నా నాకు జవాన్లే ముఖ్యం

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకుంటే పోయే నష్టం ఏం లేదని, ఈ అంశంపై తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ తీసుకుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తెలిపాడు.  కానీ ఏ నిర్ణయం తీసుకున్నా జట్టకు యావత్‌ దేశం అండగా ఉండాలన్నారు. పాక్‌తో మ్యాచ్‌ ఆడకుంటే పోయే రెండు పాయింట్ల కన్నా తనకు దేశ జవాన్లే ముఖ్యమని స్పష్టం చేశారు. పుల్వామా తరహా ఉగ్రదాడులను మాత్రం సహించలేమన్నాడు. పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించుకోవద్దనుకుంటే పూర్తిగా తెంచుకోవాలన్నారు.

ఒకవేళ బీసీసీఐ పాక్‌తో మ్యాచ్‌ ఆడకుండా 2 పాయింట్లు వదులుకోవడానికి సిద్దపడితే.. యావత్‌ దేశం మద్దతుగా నిలవాలి. ఈ పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించకపోయినా నిందించవద్దు. మీడియా కూడా రాద్దాంతం చేయవద్దు. పాక్‌ ఫైనల్‌కు వెళ్లినా ఏమనొద్దు. ఆ విధంగా యావత్‌ దేశం సిద్దమై ఉండాలి. ఆటలతో రాజకీయాలను మిళితం చేయవద్దని కొందరు వాదిస్తున్నారు. కానీ నాకు ఆట కన్నా జవాన్లే ముఖ్యం. ఐసీసీ టోర్నీలను బీసీసీఐ బహిష్కరించడం కష్టమే. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్‌ ఆడటం లేదు‌. మహా అయితే వాళ్లు ఆసియాకప్‌ను అడ్డుకోగలరు. దేశం సెంటిమెంట్‌ కన్నా ఆటలు ముఖ్యం కాదు. కొన్ని ఈవెంట్స్‌ను బహిష్కారించాలనుకున్నప్పుడు అందరం దానికి కట్టుబడి ఉండాలి.’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక గంభీర్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలపై ఎలాంటి కామెంట్‌ చేయలేదు.. ఖండించలేదు.  రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీద గంభీర్‌ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నుంచి గంభీర్‌ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు