గంభీర్‌ అసలు ఏమైంది నీకు!

6 Nov, 2018 08:51 IST|Sakshi
గౌతం గంభీర్‌ (ఫైల్‌ ఫొటో)

మండిపడుతున్న నెటిజన్లు

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట మోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంభీర్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ, సీఏబీ, సీఓఏల తమ గౌరవాన్ని కూడా కోల్పోయయన్నాడు. అయితే ఈ ట్వీట్‌ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం భగ్గుమంటుంది. ‘గంభీర్‌ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు’  అని, హైకోర్ట్‌ అతని నిషేధంపై క్లీన్‌చీట్‌ ఇచ్చిన విషయం తెలియదా? అని.. అతను ఎంపీ కూడా అయ్యారని మరొకరు కామెంట్‌ చేశారు. ముందు సీనియర్‌ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమ్మని, నార్త్‌ క్రికెటర్లను ఒకలా.. సౌత్‌ క్రికెటర్లను ఒకలా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు.  (చదవండి: అజహర్‌ బెల్‌ కొట్టడంపై గంభీర్‌ గుస్సా!)

భారత్‌ తరపున 99 టెస్ట్‌లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్‌పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్‌ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్‌ క్రికెట్‌ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్‌-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు. (టాస్‌ ఓడిపోవాలనే కోరుకుంటారు!)

మరిన్ని వార్తలు