యువీకి 'రెస్ట్'పై గంభీర్ ఇలా..

21 Aug, 2017 12:44 IST|Sakshi
యువీకి 'రెస్ట్'పై గంభీర్ ఇలా..

న్యూఢిల్లీ: వెటరన్ క్రికెటర్ యువరాజ్.. మళ్లీ భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేయడం చాలా కష్టం అంటున్నాడు సహచర ఆటగాడు గౌతం గంభీర్. శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ కు యువీని పక్కకు పెట్టిన నేపథ్యంలో గంభీర్ తీవ్రంగా స్పందించాడు. యువీని భారత సెలక్టర్లు పక్కకు పెట్టడమే కాకుండా దాన్ని సమర్ధించుకోవడాన్ని ఈ సందర్బంగా తప్పుబట్టాడు. ప్రధానంగా యువీకి విశ్రాంతినిచ్చామని చెప్పుకుంటున్న చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పై గంభీర్ విమర్శలు సంధించాడు.

 

'యువీని పక్కకు పెట్టారు. అంతవరకూ ఓకే. మరి విశ్రాంతి ఇవ్వడమేమిటి. ప్రస్తుతం యువీ వేరే ఏ క్రికెట్ అయినా ఆడుతున్నాడా రెస్ట్ ఇచ్చామని చెప్పడానికి. ఇక్కడ 'రెస్ట్'అనే పదం సరైనది కాదు. అతను జాతీయ జట్టుకు క్రికెట్ ఆడటానికి ఆసక్తిగానే ఉన్నప్పుడు రెస్ట్ అనే పదాన్ని ఎలా వాడతారు. ఒకవేళ యువీని వరల్డ్ కప్ లో చూడాలని సెలక్టర్లు భావించి ఉంటే మరికొన్ని అవకాశాలు అతనికి కచ్చితంగా ఇచ్చేవారు. ఇప్పుడు తప్పించారు కాబట్టి.. యువీకి తిరిగి చోటు దక్కడం కష్టమే. రీ ఎంట్రీ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్న యువీకి రెస్ట్ ఇచ్చామని ఎలా అంటారు 'అని గంభీర్ ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు